*బ్రెయిన్ ట్యూమర్ సర్జరీలో కొత్త విప్లవం*

updated: February 24, 2018 19:46 IST
*బ్రెయిన్  ట్యూమర్ సర్జరీలో కొత్త  విప్లవం*

బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్స్ మరింతగా ఖచ్చితత్వంతో  విజయవంతం అయ్యేందుకు మన హైదరాబాద్ నగరంలోని యశోదా హాస్పటిల్స్ నడుం బిగించింది. 23 కోట్ల రూపాయల వ్యయంతో ..దేశంలోనే తొలిసారిగా ..తెస్లా 3 ఇంట్రస్టెక్టివ్ MRI (iMRI) పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనివలన బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్స్ నిర్వహించే డాక్టర్స్ మరింత ఏక్యురసీతో ట్యూమర్స్ ని తొలిగించటం సాధ్యం అవుతుంది.

 రియల్ టైమ్  బ్రెయిన్ మ్యాపింగ్ ని సర్జరీ జరిగేటప్పుడు ఈ మిషన్ అందిస్తుంది. ఇది చాలా అడ్వాన్సెడ్ టెక్నాలజీ అని నిపుణలు చెప్తున్నారు. సాధారణంగా మైక్రో స్కోప్ లో చూస్తూ సర్జన్స్ ..తమ అనుభవాన్ని రంగరించి ఈ ఆపరేషన్స్ నిర్వహిస్తూంటారు. అయితే ఈ మిషన్ వలన అంత రిస్క్ చేయాల్సిన అవసరం ఉండదు. చాలా సేఫ్ గా ఎఫెక్టివ్ గా ఈ ఆపరేషన్ ని ఈ పరికరం సాయంతో పూర్తి చేయవచ్చు అని హాస్పటిల్ కు చెందిన సీనియర్ న్యూరో సర్జన్  డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణ్యం అన్నారు. 


 

Disclaimer: The following shared video may not be part of Telugu100.com network. Sometimes we may give external links to strengthen the quality of the posts. In this case, Telugu100.com is not responsible for the content of the videos and the original owner would be responsible for the same.

comments