డాక్టర్ గారి యూట్యూబ్ ఛానెల్.... చూస్తే అనారోగ్యం అవుతుంది నిల్

updated: March 26, 2018 10:08 IST
డాక్టర్ గారి యూట్యూబ్ ఛానెల్.... చూస్తే అనారోగ్యం అవుతుంది నిల్

ప్రపంచంలోనే అత్యంత పురాతన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఆయుర్వేదం. దాదాపు ఐదు వేల సంవత్సరాలకు పూర్వం ఆధ్యాత్మిక గడ్డ అయిన భారతదేశంలో ఆవిర్భవించిన ఆయుర్వేదంలో వైద్యం మరియు తాత్విక ఆలోచనలు రెండూ సమ్మిళితమై ఉంటాయి. ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేదం ప్రపంచవ్యాప్తంగా మానవాళి యొక్క శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మికపరంగా సంపూర్ణంగా ఎదగడానికి దోహదపడుతోంది. అయితే తాత్కాలిక ఉపమనం ఇచ్చే ఇంగ్లీష్ వైద్యం ప్రాముఖ్యత పెరగటంతో ఆ మధ్యకాలంలో కాస్తంత వెనకపడిందీ ఆయుర్వేదం. 

అయితే అతి కొద్ది సమయంలోనే జనం నిజం గ్రహించి మనదైన ఆయుర్వేదం వైపుకు మళ్లీ అడుగులు వేయటం మొదలెట్టారు. ఇటువంటి సమయంలో ఇంగ్లీష్ వైద్యానికి ధీటుగా వైద్యం చేయగల సమర్దులైన ఆయుర్వేద వైద్యుల అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి సమయంలో తన ప్రతిభతో ఉవ్వెత్తిన కెరటంలో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి ఎంతోమంది జీవితాల్లో తన వైద్య ప్రతిభ,నైపుణ్యంతో వెలుగులు నింపిన వాడు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీమనోహర్.

వైద్యుడు అనేవాడు ఏదో ఒక విభాగానికి మాత్రమే పరిమితం అయితే... అప్పుడతడు పాక్షిక వైద్యుడవుతాడు. పాక్షిక వైద్యుడు చికిత్స చేయడానికి  పనికిరాడు. అన్ని విభాగాల్లోనూ నైపుణ్యం సాధించి పరిపూర్ణజ్ఞానాన్ని పొందాలంటుంది ఆయుర్వేదం. అటువంటి పరిపూర్ణ జ్ఞానంతో,వికాశంతో వైద్యం చేస్తున్నారు  డాక్టర్ చిరుమామిళ్ళ మురళీమనోహర్. అందుకే ఆయనకు దేశమంతటా అంతపేరు. 

డాక్టర్ చిరుమామిళ్ళ మురళీమనోహర్ జాతీయస్థాయిలో ఉత్తమ ఆయుర్వేద వైద్యులుగా గుర్తింపు పొందారు. వీరి వంశంలో ఆయన మూడవ తరానికి చెందిన ఆయుర్వేద వైద్యులు. ఆయుర్వేదాన్ని అయిదున్నర ఏళ్ళపాటు అభ్యసించి, బి.ఎ.ఎం.ఎస్. డిగ్రీ, తర్వాత ఎం.డి. పట్టా పొందారు.

జాతీయ వైద్య విధానమైన ఆయుర్వేదాన్ని ప్రజల మధ్యకు తీసుకువెళ్ళడానికి ఉద్యమించారు. ఈ నేపథ్యంలో అనేక వ్యాసాలు, పుస్తాకాలు రాశారు. వీరి ఇంగ్లీషు పుస్తకాలు - ఎ రిఫరెన్స్ గైడ్ టు ఆయుర్వేదిక్ ప్రాక్రీస్, ఆయుర్వేద ఫర్ ఆల్ వంటివి మంచి ప్రజాదరణ పొందాయి. తెలుగులో వీరు రాసిన ఆయుర్వేద గృహ చికిత్సలు, ఆయుర్వేదంతో ఆరోగ్యం అనేవి కూడా అద్భుత విజయాన్ని సాధించాయి. 

 అదేసమయంలో వీరి యూట్యూబ్ ఛానెల్ సైతం ఎంతో పేరు తెచ్చుకుంది. మారు మూల ఊళ్లల్లో  ఉన్న తెలుగు వారే కాక, దూర దేశాల్లో,రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారికి సేవ చేయటం కోసం ఆయన యూట్యూబ్ ఛానెల్ నెలకొల్పి వైద్య సాయం చేస్తున్నారు. వారి వీడియోలు ఎంతో మందికి  నిండు జీవితాన్ని ఇస్తున్నాయి. 

ఆయనకు గ్లోబల్ ఎకనమిక్ కౌన్సిల్ (న్యూఢిల్లీ) డాక్టర్ మురళీ మనోహర్ కు ప్రైడ్ ఆఫ్ ఇండియా బిరుదు ఇచ్చి గౌరవించింది. అలాగే, యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెన్ అవార్డ్ ఆఫ్ ఆనర్ ను, రోటరీ క్లబ్ రోటరీ ఒకేషనల్ అవార్డును ఇచ్చి సత్కరించాయి.

 వీరు ప్రస్తుతం హైదరాబాదు, అమీర్పేటలోని సారధీ స్టూడియో రోడ్ లో రక్ష ఆయుర్వేదిక్ సెంటర్ అనే సంస్థ స్థాపించి దాని ద్వారా సశాస్త్రీయమైన ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకు అందిస్తున్నారు

Disclaimer: The following shared video may not be part of Telugu100.com network. Sometimes we may give external links to strengthen the quality of the posts. In this case, Telugu100.com is not responsible for the content of the videos and the original owner would be responsible for the same.

Tags: dr chirumamilla, chirumamilla murali manohar

comments